మిథాలి @200 వరల్డ్ రికార్డ్...

SMTV Desk 2019-02-01 10:27:03  Mithali raj, 200ODI, First women Player to play,World record

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టన్ మిథాలి రాజ్ అరుదైన రికార్డు సాధించింది. 200 వన్డేలు ఆడుతున్న ప్రపంచ తొలి మహిళ గా మిథాలి రాజ్ పేరు సంపాదించింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు మూడో వన్డే జరుగుతుంది.అయితే ఈ మ్యాచ్ తో మిథాలి రాజ్ తన కెరీర్ లో 200 వన్డేలు పూర్తి చేసుకుంటుంది. మిథాలి రాజ్ 1999 జూన్ లో తన మొదటి వన్డేను ఐర్లాండ్ తో ఆడింది. ఈ మ్యాచ్ లో మిథాలి వ్యక్తిగతంగా 114 పరుగులు చేసి, ఐర్లాండ్ పై 161 పరుగులతో భారత్ ను గెలిపించింది. కాగా నేడు జరుగుతున్న మూడో వన్డేలో మిథాలి సేన 149 పరుగుల వద్ద ఆలౌట్ అయి కివీస్ కు 150 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు.