ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఎంపీ కవిత

SMTV Desk 2019-01-31 22:27:21  best mp, mp kavitha, nizamabad mp, trs mp

నిజామాబాద్, జనవరి 31: నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు. ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో శ్రేష్ఠ్ సంసద్ అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న విషయాన్ని కవిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ అవార్డు అందుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు.

కాగా, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు స్వీకరించిన అనంతరం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ని కలిసినట్టు మరో పోస్ట్ లో కవిత పేర్కొన్నారు. తనకు ఎంతో స్ఫూర్తి దాయకమైన సుమిత్రా మహాజన్ ని కలిసి ఆమె ఆశీస్సులు పొందానని అన్నారు.