'దేవ్' అడ్వెంచర్ ట్రైలర్...

SMTV Desk 2019-01-31 18:31:23  Karthi, Rakul preet singh, Dev Movie, Dev Release date, Trailer

హైదరాబాద్, జనవరి 31: రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తీ, రకుల్ జంటగా నటించిన చిత్రం దేవ్ . ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే నెల 14 న తెలుగు, తమిళ్ లో విడుదల చేయాడానికి సినీ బృందం రంగం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కార్తి సోదరుడు సూర్య చేతుల మీదిగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. కాగా ఈ సినిమాలో నిక్కీ గిర్లానీ మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హారీష్ జయరాజ్ సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రేస్పోన్స్ రావడంతో దీనిపై భారీ గా అంచనాలు పెరిగిపోతున్నాయి.