'ఎఫ్2' రిమేక్...!

SMTV Desk 2019-01-31 12:53:43  F2, F2 movie, Anil raavipudi, Victory Venkatesh, Varun tej, Dil raaju, Remake,HIndi, Tamil

హైదరాబాద్, జనవరి 31: ఈ సంక్రాంతికి వచ్చి ఊహించని విధంగా వసూల్లు రాబడుతున్న సినిమా ఎఫ్2 . అనిల్ రావిపూడి దర్శత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ముంబైలో రోజుకి కనీసం ఇద్దరు హీరోలు ఈ సినిమా చూస్తున్నారని, హీరోలు ఫైనల్ అయిన తరువాత దర్శకుడు, మిగిలిన విషయాలు బయటకొస్తాయని అన్నారు.

ఈ సినిమాకి సంబంధించిన హక్కులన్నీ తన వద్దే ఉన్నాయని, వీలైతే హిందీలో సినిమాను నిర్మించాలని అనుకుంటున్నట్లు, కానీ నిర్మాణ భాగస్వామిగా ఉండడమే మంచిదని అన్నారు. తెలుగులో ఈ ఏడాదిలో చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. ఇక ఎఫ్ 3 సినిమా గురించి మాట్లాడుతూ.. అనీల్ రావిపూడి ఓ కథ చెప్పాడు. పూర్తి స్థాయిలో కథ సిద్ధంగా లేదు. స్క్రిప్ట్ పూర్తయిన తరువాత మూడో హీరో ఎవరో తెలుస్తుంది. 2021 సంక్రాంతికి ఎఫ్ 3 ని తీసుకొస్తామని స్పష్టం చేశారు.