తెలంగాణాలో పోటీ చేస్తా : లగడపాటి

SMTV Desk 2019-01-31 10:47:28  Chandrababu, lagadapati rajagopal, ys jagan, pavan kalyan, trs, ycp, tdp, janasena

విజయవాడ, జనవరి 31: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై సామజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ సందర్బంగా లగడపాటి స్పందిస్తూ.. తాను వొక సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పానని... ఏపీలో పోటీ చేస్తానని చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని... ఎవరినైనా కలుస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ అధినేత జగన్ ను కూడా కలిశానని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడానని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్, వైసీపీలు బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నాయని... ఏపీలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తప్పేమీ లేదని చెప్పారు. కాగా తెరాస కూడా తెలుగు రాష్ట్రానికి చెందిన పార్టీనే అని అన్నారు.