గెలుపు దిశగా కివీస్

SMTV Desk 2019-01-31 10:42:31  India VS Newzeland, 4th ODI, Shikar dhawan, Kane willamson

న్యూజిలాండ్/హామిల్టన్, జనవరి 31: భారత్-న్యూజిలాండ్ మధ్య నాలుగో వన్డే హామిల్టన్ వేదికగా జరుగుతుండగా కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తమ బౌలింగ్ ప్రదర్శనకు భారత్ ఊహించని విధంగా 92 వద్ద ఆలవుటయి కివీస్ కు 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందుంచింది భారత్.

భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ విలియమ్సన్ భువనేశ్వర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా మొదటి వికెట్ 2 ఫోర్లు కొట్టి ఊపు మీదున్న ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 14 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. విజయానికి ఇంకా 36 పరుగుల దూరంలో న్యూజిలాండ్ నిలిచింది.