భారత్ పేలవ ప్రదర్శన...కివీస్ విజయ లక్ష్యం 93

SMTV Desk 2019-01-31 10:09:10  India VS Newzeland, 4th ODI, Rohit sharma

న్యూజిలాండ్/హామిల్టన్, జనవరి 31: భారత్-న్యూజిలాండ్ మధ్య హామిల్టన్‌లో జరుగుతున్న నాలుగో వన్డేలో కివీస్ బౌలర్ల ధాటికి భారత్ అతి తక్కువ స్కోరు చేసి కుప్పకూలిపోయింది. కేవలం 30.5 ఓవర్లలోనే 92 పరుగులకు అలౌటై కివీస్ కు 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకోగా భారత్ బాటింగ్ దిశగా క్రీజులోకి వెళ్ళింది. చాహల్ వంద పరుగుల మార్క్‌ను దాటించేందుకు శ్రమించినా న్యూజిలాండ్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. భారత బ్యాట్స్‌మెన్లలో చాహల్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బోల్ట్ 5, గ్రాండ్ హోమ్మీ 3 వికెట్లు తీశారు.





కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్ కూడా అత్యల్ప స్కోరుకే అవుటయ్యారు. శిఖర్ ధావన్ ను 13 పరుగులకు, రోహిత్ శర్మను 7 పరుగులకు బౌల్ట్ పెవిలియన్ కు పంపించాడు. అయితే ఈ మ్యాచ్‌కు విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్‌ శర్మ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఇదివరకే 3-0తో సిరీస్‌ ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఆతిథ్య జట్టును క్లీన్‌ స్వీప్‌ చేయాలని చూస్తోంది. మరో వైపు ఈ మ్యాచ్‌ గెలిచి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది. భారత్ తుది జట్టులోకి కొత్త ఆటగాడు శుభమన్ గిల్ వచ్చాడు. గాయంతో బాధపడుతున్న ఎంఎస్ ధోనీ ఈ మ్యాచుకు కూడా దూరమయ్యాడు.





జట్లు

భారత్‌: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, ఖలీల్‌ అహ్మద్‌

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్తిల్‌, హన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, టాడ్‌ ఆస్టిల్‌, మాట్‌ హన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌