'దేవ్' రిలీజ్ డేట్ ఫిక్స్...

SMTV Desk 2019-01-30 18:30:44  Karthi, Rakul preet singh, Dev Movie, Dev Release date

ైదరాబాద్, జనవరి 30: కార్తీ, రకుల్ జంటగా నటించిన చిత్రం దేవ్ . ఈ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించగా ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14 న విడుదల చేసేందుకు కినీ బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సంక్రాంతికి విదులైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. హారీస్‌జయరాజ్‌ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, పవర్‌ఫుల్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. నిక్కీ గల్రాని మరో కథానాయికగా నటిస్తోంది. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్‌ మధు దక్కించుకున్నారు. రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తి, రకుల్ ఇదివరకు ఖాకీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.