హీరోయిన్లను చూస్తుంటే ఒళ్లు మండిపోతుంది...!

SMTV Desk 2019-01-30 17:15:36  SP Balasubrahmanyam, Comments on tollywood heroins

హైదరాబాద్, జనవరి 30: తెలుగు, హిందీ, తమిళం అనే తేడా లేకుండా దాదాపు 10/15 భాషల్లో గాన గాంధర్వుడిగా పేరు సపాదించిన లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజగా ఓ వేదికపై మాట్లాడుతూ కథానాయికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సినీ రంగంలో చర్చానీయాంశంగా మారాయి. తాజాగా తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మధుర గాయకుడు టాలీవుడ్ హీరోయిన్ల గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపర్చారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయంటూ సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు.

`ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక మీదకు వచ్చే హీరోయిన్లను చూస్తుంటే వొళ్లు మండిపోతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల మంది హీరోయిన్లు చిన్న చిన్న బట్టలేసుకుని వేదికపైకి వస్తుంటారని, అలాంటి బట్టలేసుకుంటే తప్ప దర్శక, నిర్మాతలు సినిమాల్లో అవకాశాలు ఇవ్వరని వాళ్లు అనుకుంటారేమో అని అన్నారు. అందుకే తెలుగు అమ్మాయిలు సినిమాల వైపు రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవడానికి సినిమావాళ్లు ఇష్టపడడం లేదని పేర్కొన్నారు. అంగాంగ ప్రదర్శన చేసేవాళ్లే వాళ్లకు కావాలన్నారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడ్డానికి తాను ఎవరకీ భయపడనని, ఏ హీరోయిన్‌కైనా కోపం వచ్చినా ఫర్వాలేదని బాలు అన్నారు. కాగా బాలు వ్యాఖ్యలపై హీరోయిన్లు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.