తగ్గనున్న ఐఫోన్‌ ధరలు

SMTV Desk 2019-01-30 17:12:01  iPhone, apple products, cost reducing

శాన్ ఫ్రాన్సిస్కో, జనవరి ౩౦: ప్రపంచవ్యాప్తంగా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్‌ విక్రయాలు క్రమంగా తగ్గుతున్నాయని యాపిల్‌ సిఈఓ టిమ్‌కుక్‌ అన్నారు. దీనికి కారణం డాలర్ విలువ పెరగడం, బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ తదితర కారణాల వలన భారత్ వంటి కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్‌ విక్రయాలు నానాటికి తగ్గుతున్నాయని అభిప్రాయపడ్డారు.

కంపెనీ లాభ నష్టాల గురించి కుక్ మార్కెట్ విశ్లేషకులతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్‌ విలువ పెరగడంతో ఆపిల్ ఉత్పత్తుల ధర పెరుగుతోందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ధరల మోత ఎక్కువగా ఉన్నందున వినియోగదారులు ఐఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపడం లేదని అన్నారు. అయితే విక్రయాలు పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని కుక్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో చైనాలో ఐఫోన్‌ ధరలు తగ్గించామని, భారత్‌లోనూ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.