నాబార్డ్ రాష్ట్ర వార్షిక ప్రణాళిక విడుదల

SMTV Desk 2019-01-30 14:06:56  Nabard Annual plan release, Telangana, SK Joshi

హైదరాబాద్, జనవరి ౩౦: హైదరబాద్ లోని మ్యారీగోల్డ్‌ హోటల్‌లో నాబార్డు రాష్ట్ర ప్రణాళిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోష్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన 2019-20 వార్షిక ప్రణాళిక విడుదల చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యతా రంగాలకు రూ. లక్ష కోట్లపైగా రుణాలు ఇవ్వనున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 22 శాతం అధిక రుణాలను కేటాయించారు.

వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం రూ. 61,457 కోట్లు, మార్కెటింగ్‌, నిల్వ, భూమి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2,318 కోట్లు, వ్యవసాయ సహాయ కార్యకలాపాలు, ఫుడ్‌, ఆగ్రో శుద్ధి రంగాలకు రూ. 7,189 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు రూ. 1,008 కోట్లు కేటాయించారు. వీటితో పాటు ఎగుమతులు, విద్యా, గృహ నిర్మాణం, సంప్రదాయేతర ఇంధన వనరులకు కూడా నిధులు కేటాయించారు.