కోట్ల చేరికపై టీడీపీ నేత స్పందన..

SMTV Desk 2019-01-30 13:05:20  Andhra Pradesh TG Venkatesh, Kotla Surya Prakash Reddy, TDP, Congrees Party, Chandrababu

జనవరి 30: టీడీపీలో చేరబోతున్న కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కుటుంబ సమేతంగా కలిసిన కోట్ల... టీడీపీలో చేరేందుకు కొన్ని కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో పలువురి టీడీపీ నేతల స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా టీడీపీ నేతలు కోట్ల విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు.

ఇక దీనిపై రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ.. అందరికీ అనుకూలంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అందరికీ న్యాయం చేసే విధంగానే చంద్రబాబు నడుచుకుంటారన్న టీజీ వెంకటేష్.. చంద్రబాబు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అయితే వాటికి ఆకర్షితులయ్యే కోట్ల, టీడీపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం చంద్రబాబు ఇంత వరకు ఏమీ మాట్లాడలేదని... కానీ, కేఈ కుటుంబానికి, బుట్టా రేణుకకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం వ్యక్తం చేశారు.