తనీష్ విచారణలో కీలక అంశాలు వెల్లడి

SMTV Desk 2017-08-01 11:50:52  drugs case, tanish, sit, oficitions, enqary

హైదరాబాద్, ఆగస్టు 1 : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మందిలో సిట్ అధికారులు ఇప్పటి వరకు 10 విచారించారు. 11 వ వ్యక్తిగా హీరో తనీష్ ను సోమవారం అధికారులు విచారిస్తూ... కెల్విన్ తో ఉన్న సంబంధాలు, యువ నటులతో ఉన్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరాతీశారు. అయితే ఇందులో తనీష్ కీలక విషయాలు బయటపెట్టారని తెలుస్తుంది. సిట్: కెల్విన్ తో మీకు ఎలాంటి పరిచయం ఉంది.? తనీష్: కెల్విన్ నా సినిమాలకు ఈవెంట్స్ చేసేవాడు. అందువల్ల అతనితో పరిచయం ఏర్పడింది. సిట్: కెల్విన్ తో డ్రగ్స్ కూడా తెప్పించుకునే వారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.? తనీష్: కెల్విన్ తో పరిచయం ఉన్న మాట నిజమే కాని అది సినిమా ఫంక్షన్స్ వరకు మాత్రమే డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదు.! సిట్: యువ హీరోలతో ఉన్న పరిచయాలు ఎలాంటివి ? తనీష్: నేను సినిమా ఇండస్ట్రీకి బాల నటుడిగా అడుగుపెట్టాను. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాను. అందులో భాగంగానే తరుణ్ తో సాన్నిహిత్యంగా ఉంటున్నాను.! అని అన్నారని సిట్ వర్గాలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ విచారణ మద్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగింది.