'యాత్ర' 'మరుగైనవ రాజన్న' లిరికల్ సాంగ్.....

SMTV Desk 2019-01-29 18:55:24  Yatra movie, Mammootty, YS Rajashekhar reddy, Marugainava rajanna lyrical song

హైదరాబాద్, జనవరి 29: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర . ఈ సినిమాలో వైఎస్ రాజేశేఖర్ రెడ్డి పాత్ర సంచలన నటుడు మమ్ముట్టి పోషిస్తున్నాడు. మహి వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం మూడు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సనగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి తాజాగా మరో లిరికల్ సాంగ్ ను సినీ బృందం విడుదల చేసింది.

మరుగైనవ రాజన్న అంటూ వస్తున్న ఈ పాటకి తన గొంతుతో ప్రాణం పోశాడు పెంచల్ దాస్. కే తనదైన స్టైల్ లో ఈ పాటకి టోన్ సెట్ చేశారు. ఈ పాట సినిమాలో వైఎస్ పాత్రధారి మమ్ముట్టి మరణం అనంతరం ఉండేలా ఉంది అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ పాటలకి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.