'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి' లిరికల్ సాంగ్...

SMTV Desk 2019-01-29 17:24:35  Where is venkata lakshmi, Lyrical song, Attili papa,

హైదరాబాద్, జనవరి 29: లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వేర్ ఈజ్ వెంకట లక్ష్మి . ఈ సినిమాకు కిషోర్(లడ్డ) దర్శకత్వం వహించగా ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్ కె. రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిసున్నారు. ఈ సినిమాకి హరి గౌర సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఇదివరకే ఓ లిరికల్ పాట విడుదల చేయగా తాజాగా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు సినీ బృందం.



అత్తిలి పాప అంటూ వస్తున్న ఈ పాట ప్రస్తుతం నెట్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీతో పాటు పూజిత పొన్నాడ, కార్తిక్, ప్రవీణ్, మధు నందన్, బ్రహ్మాజీ, జబర్ధస్త్ మహేష్, జెమినీ నరేష్ డి.వి. , పంకజ్ తదితరులు నటిస్తున్నారు.