షూటింగ్ లో నానికి ప్రమాదం...!

SMTV Desk 2019-01-29 17:10:02  Nani, Jersey movie, Gowtam, Natural star nani, Mallirava Fame director gowtam, Shooting spot accident

హైదరాబాద్, జనవరి 29: నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, మళ్ళిరావా సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా గౌతమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం జెర్సీ . ఈ సినిమాకు సంభందించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆటకు సంబందించిన సన్నివేశాల్లో పాల్గొన్న నాని అనుకోకుండా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాని స్పెషల్ గా క్రికెట్ కోచింగ్ కూడా తీసుకున్నాడు. అయితే కొన్ని సీన్స్ కోసం రిస్కీ షాట్ ఆడబోయి షూటింగ్ స్పాట్ లో బంతి నాని ముఖంపై తగిలినట్లు తెలుస్తోంది.

చిన్నపాటి గాయాలు కావడంతో పెద్దగా ప్రమాదం జరగలేదని చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందింది. అయితే గాయం కారణంగా నాని రెండు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ కు వస్తాడని చెబుతున్నారు. ఇటీవల రిలీజైన సినిమా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.