'ఉరి' పై జీఎస్టీ ఎత్తివేత

SMTV Desk 2019-01-29 16:15:20  URI The Surgical strike, Uttar pradesh Chief Minister, Yogi adhityanath, GST, Vicky koushal, Yami gautam

లక్నో, జనవరి 29: విక్కీ కౌశల్, యమీ గౌతం జంటగా నటించిన చిత్రం ఉరి ది సర్జికల్‌ స్ట్రైక్ . ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా రోన్నీ స్క్రీవేల నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యానాథ్ ఈ రోజు ప్రయాగ్‌రాజ్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సర్జికల్‌ దాడుల నేపథ్యంలో విడుదలైన సినిమా ఉరి ది సర్జికల్‌ స్ట్రైక్‌ పై రాష్ట్ర జిఎస్టీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

అంతేకాక దేశ ప్రజలు, యువతలో ఉరి సినిమా జాతీయ భావాన్ని కలిగిస్తుందని యోగి అన్నారు. విశాల్‌ కౌశల్‌ నటించిన ఈ ఫిల్మ్‌ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాస్తుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫిల్మ్‌…ఇప్పటికే 150 కోట్లు వసూలు చేసింది.