2020 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌

SMTV Desk 2019-01-29 15:34:33  T20 World Cup, 2020 T20 World cup, Schedule, Australia, Melbourne

న్యూ ఢిల్లీ, జనవరి 29: ఐసీసీ 2020 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఊహించని విధంగా మహిళా, పురుషుల టీ 20 వరల్డ్‌కప్ వొకే సంవత్సరం, వొకే వేదికపై జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. 2020 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు మహిళా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 24 నుంచి నవంబర్ 15 వరకు పురుషుల టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ రెండు టోర్నీలు మొత్తం 13 వేదికల్లో జరగనున్నాయి. అంతేకాక ఈ రెండు ఈవెంట్ ల ఫైనల్ మ్యాచ్‌లకు మెల్‌బోర్న్ వేదికకానుండటం విశేషం. మహిళల ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పోటీ పడుతుండగా.. పురుషుల టోర్నీలో 12 జట్లు బరిలో నిలవనున్నాయి.

టీ20 మహిళా వరల్డ్‌కప్ భారత్ షెడ్యూల్:

ఫిబ్రవరి 21, 2020: ఆస్ట్రేలియాతో సిడ్నీలో
ఫిబ్రవరి 24, 2020: క్వాలిఫయర్ 1తో పెర్త్‌లో
ఫిబ్రవరి 27, 2020: న్యూజిలాండ్‌తో జంక్షన్ ఓవల్‌లో
ఫిబ్రవరి 29, 2020: శ్రీలంకతో జంక్షన్ ఓవల్‌లో



టీ20 పురుషుల ప్రపంచకప్: భారత్ షెడ్యూల్

అక్టోబర్ 24, 2020: దక్షిణాఫ్రికాతో పెర్త్‌లో
అక్టోబర్ 29, 2020: క్వాలిఫయర్ 2తో మెల్‌బోర్న్‌లో
నవంబర్ 1, 2020: ఇంగ్లాండ్‌తో మెల్‌బోర్న్‌లో
నవంబర్ 5, 2020: క్వాలిఫయర్ 1తో అడిలైడ్‌లో
నవంబర్ 8, 2020: ఆఫ్ఘనిస్తాన్‌తో సిడ్నీలో