రాజీనామాకి సిద్దపడ్డ కుమారస్వామి

SMTV Desk 2019-01-29 14:14:17  Kumaraswami, Shivakumar, Congress, JDS, BJP

బెంగళూరు, జనవరి 29: కర్ణాటకలో రాజకీయ వివాదాలు వేడెక్కాయి. కాంగ్రెస్ నేతలు జేడీఎస్ నేత కుమార స్వామి ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరుచుకున్నకాంగ్రెస్-జేడీఎస్ ఇప్పుడు పాము ముంగిసగా మారారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ స్థానాలు సాదించి కూడా ముఖ్యమంత్రి పదవి దక్కలేదని ఇర్ష్యపడుతున్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని జేడీఎస్‌ తో జతకట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా కూడా కాంగ్రెస్ అసంతృప్తులు మాత్రం తమ అక్కసును వీలు దొరికినప్పుడల్లా వెళ్లగక్కుతూనే ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల పద్ధతి పై కుమార స్వామి వారికి హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ నేతలు హద్దు దాటి ప్రవర్తిస్తున్నారని, తనను తీవ్రంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటె తను కాంగ్రెస్ తో కలిసి ఉండటం కష్టమని ముఖ్యమంత్రి పదవికి సైతం రాజీనామా చేస్తానన్నారు.

కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల్ని అదుపులో పెట్టుకోవాలని వ్యాక్యనించారు. గత కొద్దికాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు సీఎం. అయితే కుమారస్వామిని వ్యతిరేకిస్తున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యే సిద్ధరామయ్య వర్గానికి చెందినవారని, దీనివల్ల సిద్ధరామయ్యకు, కుమారస్వామికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని వార్తలు. ఈ పరిణామాల్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది బీజేపీ. ఎక్కువ సీట్లు సాధించి కూడా కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయలేని బీజేపీ నేతలు మరోసారి అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ నేతలకు , ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. ఇప్పుడు కుమారస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ సమర్దించారు ఆయన అలా అనుకోవడం తప్పులేదని కానీ మా సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన చిక్కేమీ లేదని ఆయన పేర్కొన్నారు.