క్రిష్ పై కంగనా సోదరి కామెంట్స్

SMTV Desk 2019-01-29 12:56:09  Kangana ranaut, Krish jagarlamudi, Rangoli, Manikarnika

ముంభై, జనవరి 29: దర్శకుడు క్రిష్ పై కంగనా రనౌత్‌ సోదరి రంగోలి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొద్ది రోజులుగా కంగనా పై క్రిష్ చేస్తున్న ఆరోపణల గిరించి తెలిసిందే. అయితే వాటికి రంగోలి స్పందిస్తూ ‘‘క్రిష్‌ .. సినిమా మొత్తం మీరే డైరెక్ట్‌ చేశారు. కొంచెం కామ్‌గా ఉండండి. సినిమాకు హీరోయిన్‌ కంగనే కదా. ప్రస్తుతం తన సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయనివ్వండి, ఆమెను వొంటిరిగా వదిలేయండి, మేము మిమల్ని నమ్ముతున్నాం...వెళ్లి పని చూసుకోండి (కూర్చోండి) ’’ అని వెటకారంగా ట్వీట్ చేసారామె. ఈ కామెంట్స్‌ గురించి కంగనా ఎలా స్పందిస్తారో చూడాలి.

ఈ మధ్య ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మణికర్ణిక’ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పేర్కొన్నారు క్రిష్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మణికర్ణిక’ సినిమాను జూన్‌లోనే పూర్తి చేశాను. అన్ని పాత్రలు డబ్బింగ్‌ కూడా చెప్పేసుకున్నారు. అప్పుడు ‘మెంటల్‌ హై క్యా’ షూటింగ్‌ నిమిత్తం లండన్‌లో ఉన్నారు కంగనా. ఇండియా వచ్చిన తర్వాత నేను చిత్రీకరించిన విధానం నచ్చలేదని నిర్మాణ సంస్థను నమ్మించి భోజ్‌పూరి సినిమాలా ఉందని వాళ్లతో పేర్కొన్నారు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరగాలన్నట్టు కంగనా ప్రవర్తన ఉండేది. సోనూసూద్‌ పాత్ర సుమారు 100 నిమిషాలు ఉండేది. దాన్ని 60 నిమిషాలకు కుదించేయడంతో ఆయన తప్పుకున్నారు. 'సోనూ సూద్' లేడీ డైరెక్టర్‌తో యాక్ట్‌ చేయను అనే కారణం కరెక్ట్ కాదు. ఫస్ట్‌ హాఫ్‌లో ఓ 25 శాతం సెకండ్‌ హాఫ్‌లో 15 శాతం మాత్రమే కంగనా రనౌత్‌ డైరెక్ట్‌ చేశారు’’ అంటూ తెర వెనుక జరిగిన విషయాన్ని పంచుకున్నారు.