'మహర్షి' ఫోటోలు లీక్

SMTV Desk 2019-01-29 12:29:17  Mahesh babu, Maharshi, Vamshi paidipalli, Maharshi shooting pics

హైదరాబాద్, జనవరి 29: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా మహర్షి . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచిలో జరుగుతోంది. అయితే షూటింగ్ ప్రదేశానికి మహేష్ బాబు అభిమానులు అధిక సంఖ్యలో అక్కడికి రావడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అదుపు చేయలేకపోయింది. అక్కడికి వొచ్చిన కొందరు ఔత్సాహికులు షూటింగ్ కి సంబంధించిన వీడియోను తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.






మహేష్ మీడియాతో మాట్లాడే సన్నివేశానికి సంబంధించిన ఫోటో లీకైంది. ఈ ఫోటోలను మహేష్ అభిమానులే షేర్ చేస్తుండడం గమనార్హం. ఈ సినిమాలో మహేష్ గుబురు గడ్డంతో కనిపించబోతున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.