రాక్ స్టార్ గా మారబోతున్న హీరోయిన్

SMTV Desk 2019-01-29 10:49:36  Shruthi Hasan, Pawan Kalyan, Katamarayudu, Music band

హైదరాబాద్, జనవరి 29: శ్రుతి హాసన్ తెలుగు తెరపై కనిపించి చాల కాలమే అయింది. ఆమె చివరగా పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు సినిమాలో కనిపించింది ఆ తర్వాత వొక్క సినిమా కూడా సైన్ చేయలేదు. శృతి హాసన్ సినిమాలోకి రాకముందు నుంచే మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈనాడు, రేసుగుర్రం లాంటి సినిమాలలో పాటలు కూడా పాడింది. ఆమె మంచి రాక్ స్టార్ గా స్థిరపడుతుందని అందరు అనుకున్నారు. శృతి హాసన్ కూడా సొంతంగా రాక్ బ్యాండ్ ని తయారు చేసుకొని దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వాలనుకుంది. కాని సినిమాలోకి రావడంతో తన సింగింగ్ టాలెంట్ ని పక్కన పెట్టేసింది.

ఇపుడు సినిమాలకి దూరంగా ఉంటూ సొంతంగా మ్యూజిక్ బ్యాండ్ ని ఫార్మ్ చేసుకుంది. త్వరలోనే మ్యూజిక్ కాన్సర్ట్ చేయబోతోంది. దానికోసం శృతి హాసన్ స్వయంగా మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాకుండా లిరిక్స్ కూడా రాసిందట. ఈ కాన్సర్ట్ గానీ సక్సెస్ అయితే ఇకపై శృతి వరుసగా స్టేజి షోస్ మరియు కాన్సర్ట్స్ ప్లాన్ చేస్తుంది. దీన్ని బట్టి ఇకపై శృతి హాసన్ సినిమాలో నటించిందని స్పష్టం గా తెలుస్తోంది.