పోర్న్ సైట్స్ లో ప్రముఖ సింగర్ ఫొటోస్

SMTV Desk 2019-01-29 10:43:41  Chinmay sripada, Mee too, Porn sites, Twitter, Chinmay saree pics

హైదరాబాద్, జనవరి 29: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తాజాగా మరో సంచలన ఆరోపణలు చేసింది. చిన్మయి మీ టూ ఉద్యమంలో ఎప్పటి నుంచో ప్రముఖ వ్యక్తుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ట్విట్టర్ ఓ నెటిజన్ చిన్మయిని అభినందిస్తూ చీర కట్టుకోమని సలహా ఇచ్చాడు. దీనిపై స్పందించిన చిన్మయి.. షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

గతంలో ఇలానే కొందరి సలహాల మేరకు చీర కట్టుకుంటే కొంతమంది సైడ్ నుండి నా ఎద భాగం, నడుము కనిపించేలా ఫోటోలు తీసి వారిని సాఫ్ట్ పోర్న్ సైట్లోకి అప్లోడ్
చేశారు. మరికొంతమంది వాటిని చూస్తూ masturbating చేసుకున్న విషయాలను నాకు మెసేజ్ లుగా పంపించారు అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.