ప్రజాశాంతి పార్టీలో యాంకర్ శ్వేతారెడ్డి

SMTV Desk 2019-01-29 10:07:28  KA Paul, Swetha Reddy, Prajashanthi Party ticket

అమరావతి, జనవరి 29: కేఏ పాల్ ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన అవకాశమును టీవీ యాంకర్ శ్వేతారెడ్డి అంగీకరించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పాల్ రూపంలో తనకు దక్కిన అదృష్టంపై శ్వేతారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, కానీ రాజకీయాల్లోకి రావాలన్న తన కల ఇలా నెరవేరబోతోందంటూ పాల్ ఆఫర్‌ను స్వీకరించారు.ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్వేతారెడ్డి పాల్‌ను పార్టీ టికెట్ కోసం ఎంత డబ్బు తీసుకుంటారని ప్రశ్నించారు. శ్వేతారెడ్డి కి పాల్ బదులిస్తూ.. వొక్క రూపాయి కూడా తీసుకోబోనని, అవసరమైతే మీరు కూడా రావొచ్చంటూ ఆహ్వానించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నా టికెట్ ఇస్తానంటూ బంపరాఫర్ ఇచ్చారు.