అజిత్ సరసన విద్యా బాలన్

SMTV Desk 2019-01-28 16:08:24  Bollywood, Ajith, Vidya Balan

బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘పింక్‌ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్, అందాలతార తాప్సి, కీర్తి కుల్హరి, ఆండ్రియా తరియంగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. తమిళంలో ఈ చిత్రాన్ని అజిత్‌తో రీమేక్‌ చేయనున్నారు. అజిత్ నటించబోయే 59వ చిత్రమిది. అలనాటి తార శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రబృందం తాజాగా సినిమాలో నటీనటుల వివరాలను ప్రకటించింది. ఇందులో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ అజిత్‌కు జోడీగా నటించనున్నారు.

తాప్సి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్‌, కీర్తి కుల్హరి పాత్రలో అభిరామి వెంకటాచలమ్‌ నటించనున్నారు. ఆండ్రియా తరియంగ్‌ తన పాత్రలో తానే నటించబోతున్నారు. వీరితో పాటు ఆది కే రవి, అశ్విన్ రావు, అర్జున్‌ చిదంబరం సహాయ పాత్రల్లో నటించనున్నారు. ‘ఖాకీ ఫేం హెచ్‌. వినోద్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ ప్రేక్షకులకు‌ తగ్గట్టు ఈ రీమేక్‌ స్క్రిప్ట్‌లో మార్పులు చేసినట్లు సమాచారం.