సీఎం 'కియా' కారు ఫస్ట్ రైడ్..

SMTV Desk 2019-01-28 15:42:40  Chandrababu, Kia motors, kia first car release

అనంతపురం, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుతీసుకురావడంలో భాగంగా మొదటగా వచ్చిన సంస్థ కియా మోటార్లు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కియా కార్ల పరిశ్రమలో అప్పుడే తొలి కారు విడుదలకు సిద్ధంగా ఉంది. అనతి కాలంలోనే ఏపీలో పరిశ్రమను నిర్మించిన కియా సంస్థ... ఈ యూనిట్ లో తయారు చేసిన కారును విడుదల చేసేందుకు సర్వ సిద్ధం చేసింది. పరిశ్రమలో తయారైన తొలి కారు ట్రయల్ రన్ కూడా పూర్తైంది.

ఈ సందర్బంగా రేపు సీఎం చంద్రబాబు తొలి కారును లాంచ్ చేయనున్నారు. కాగా ప్రతి ఆరు నెలలకు వొక కొత్త మోడల్ కారును మార్కెట్లోకి తెచ్చేలా కియా సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుందట. ఈ తొలి కారును రేపు చంద్రబాబు విడుదల చేయడమే కాకుండా... స్వయంగా నడపనున్నారు.