హిట్ కోసం పరితపిస్తున్న 'బాణం' హీరో

SMTV Desk 2019-01-28 15:16:55  Baanam, Nara Rohit, chaitanya dantuluri

హైదరాబాద్, జనవరి 28: బాణం సినిమా తో తెరంగేట్రం చేసిన నారా రోహిత్ ఆ తర్వాత వరుస సినిమాలు చేసాడు. అందులో కొన్నింటికి నారా రోహిత్ కి నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. అయితే కొంత కాలంగా ఈ హీరో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టే ఉద్దేశ్యం లో ఉన్నాడు. అందుకు దర్శకుడు చైతన్య దంతులూరి తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటివరకు చేయని పాత్ర కావడంతో, నారా రోహిత్ ఈ సినిమాను చేయడానికి ఉత్సాహాన్ని చూపించాడు. తొలి చిత్రమైన బాణం తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు,రోహిత్ కాంబోలో ఈ చిత్రం రాబోతుంది.

కాగా ఈ మధ్య కాలంలో విడుదలైన నారా రోహిత్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ చిత్రం పై నారా రోహిత్ భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం స్క్రిప్ట్ లాక్ చేసేశారు మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావొచ్చాయి. వచ్చేనెల చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి. మరోసారి ఈ ఇద్దరూ కలిసి హిట్ కొడతారేమో చూడాలి.