మణికర్ణిక విషయంలో మోసం జరిగిందన్న డైరెక్టర్

SMTV Desk 2019-01-28 13:58:42  Manikarnika, Kangana Ranaut, Krish

హైదరాబాద్, జనవరి 28: మణికర్ణిక విడుదలకు ముందు వరకు మౌనంగా ఉన్న క్రిష్, సినిమా విడుదల తరువాత సినిమా విషయం లో మోసం జరిగిందని ఆరోపించాడు.ఆయన కంగన రనౌత్ ని గానీ, చిత్ర యూనిట్ ని గానీ తప్పుపట్టకుండా అసలు విషయం గురించి చెప్పుకొచ్చారు.

" మేము ఈ సినిమా కోసం 109 రోజులు హైదరాబాద్, ముంబై, జైపూర్, జోధ్ పూర్ లో షూటింగ్ చేసాం మరియు 400 రోజులు పూర్తిగా సినిమా కోసం పని చేసాం. నేను ఎన్టీఆర్ బయోపిక్ అంగీకరించేటప్పటికీ మణికర్ణికా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అక్టోబర్ లో టీజర్ రిలీజ్ అయినపుడు డైరెక్టర్ గా నా పేరు మాత్రమే ఉంది. కాని తర్వాత డిసెంబర్ లో ట్రైలర్ రిలీజ్ అయినపుడు డైరెక్టర్ గా నా పేరు తరువాత కంగనా పేరు కూడా కనిపించింది. సినిమా రిలీజ్ తర్వాత డైరెక్టర్ గా కంగనా పేరు ముందు ఆ తర్వాత నా పేరు ఉంది. " అని క్రిష్ అన్నారు.

ఈ విషయం గురించి క్రిష్ నిర్మాతలను అడగగా వాళ్ళు కంగనా చెప్పడం వల్లే అలా చేశామని చెప్పారు. ఈ చర్యతో తన నైతికత మరియు సమగ్రతను కించపరిచారని క్రిష్ అన్నారు. కంగనా సినిమా నుంచి సోను సూద్ ని అకారణంగా తీసేయడాన్ని ఆయన తప్పుపట్టారు. వివాదాల నుంచి దూరంగా ఉండాలనుకోవడం వల్ల క్రిష్ ఈ సినిమా గురించి మాట్లాడటానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం.