కెసిఆర్ గురించి పవన్ కి ఫుల్ క్లారిటీ వుంది

SMTV Desk 2019-01-28 13:50:22  Vijayashanthi, Pawan Kalyan, Chandrasekhar Rao, KTR, Jaganmohan Reddy, Mayavati, Akhilesh Yadav, TRS, TDP, YCP, Janasena, Congress

అమరావతి, జనవరి 28: ఇటీవలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, కార్య నిర్వాహక అధికారి కేటీర్ తో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి, "కెసిఆర్ గురించి పవన్ కు ఫుల్ క్లారిటీ ఉంది, కాబట్టి ఆయన ఉచ్చులో పవన్ పడకపోవచ్చు" అని అన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు.

ఏపీ రాజకీయాల్లో పవన్ ముఖ్య రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నాడని, అటువంటి పవన్ ను ఎదో విదంగా వివాదాల్లోకి లాగాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ లో మాయావతి-అఖిలేష్ యాదవ్ లు కలవగా లేనిది పవన్-చంద్రబాబు కలిస్తే తప్పేంటని టీడీపీ నేతలు అంటున్నారని విజయశాంతి పేర్కొన్నారు.

రిపబ్లిక్ డే వేడుకల్లో కెసిఆర్-పవన్ మంతనాలు జరిపి మరింత గందరగోళానికి వెలుగుచూపారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఏపి కి వెళ్లి జగన్ తో చర్చిస్తానన్న కెసిఆర్ అంతకన్నా ముందే పవన్ తో మాట్లాడి ఎం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్సేతర ఫ్రంట్‌లు ఏర్పాటు చేయడం కంటే జనసేన-వైసీపీలను వొకవేదిక మీదకు తీసుకు రావడాన్నే ఆయన అజెండాగా పెట్టుకున్నారన్న సందేహం వస్తోందన్నారు.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తో పొత్తు వద్దని కెసిఆర్ టీడీపీ తో కలిశారు, అటువంటి కెసిఆర్ గురించి, టీఆర్ఎస్ జిత్తుల గురించి పవన్ కు బాగానే క్లారిటీ ఉండి ఉంటుందని అన్నారు. కాబట్టి పవన్ అంత త్వరగా కెసిఆర్ వలలో పడకపోవచ్చు అని విజయశాంతి పేర్కొన్నారు.