ఏటీఎంలో పులి పిల్ల

SMTV Desk 2019-01-28 13:24:13  Himachal pradesh, ATM centre, Tiger, Shocking news, Forest

హిమాచల్ ప్రదేశ్, జనవరి 28: హిమాచల్ ప్రదేశ్ లో వొక వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు దగ్గర్లో వున్న ఏటీఎం సెంటర్‌లోకి వెళ్ళాడు అంతలోనే వొక జంతువూ ని చూసి షాక్ కి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లా తుంగ్ ప్రాంతంలో దారి తప్పిన చిరుతపులి పిల్ల దగ్గర్లో వున్న ఊర్లోకి వచ్చి చలికి తట్టుకోలేక ఏటీఎం సెంటర్‌లో తల దాచుకుంది . కాస్త వెచ్చగా ఉండడంతో అక్కడే ఉండిపోయింది. ఏటీఎం పులి పిల్ల ఉందని తెలియని వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లి దానిని చూసి హడలిపోయాడు. గుండెలు అరచేతితో పట్టుకుని భయంతో పరుగులు తీశాడు. వ్యక్తి కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో ఆరా తీసిన స్థానికులు ఏటీఎంకు చేరుకుని లోపలున్న పులి పిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చివరికి ఓ టాక్సీ డ్రైవర్ సాహసం చేసి ఏటీఎం నుంచి దానిని బయటకు తీశాడు. అతడి చేతుల నుంచి తప్పించుకున్న పులి పిల్ల అక్కడే ఉన్న ఓ వాహనం కిందికి వెళ్లి నక్కింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి దానిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. పులి పిల్ల ఏటీఎంలో దూరడంపై స్థానికులు మాట్లాడుతూ.. చలికి తట్టుకోలేకే అది అందులో దూరినట్టు చెప్పారు.