కొనసాగుతున్న మణికర్ణిక జోరు

SMTV Desk 2019-01-28 13:12:11  Maniakarnika, Kangana Ranaut, Collections, Krish

హైదరాబాద్, జనవరి 28: కంగనా రనౌత్ నటించిన చారిత్రక చిత్రం మణికర్ణిక , రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 25న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమా విడుదలకి ముందే ట్రైలర్స్ మరియు టీజర్స్ తో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. విడుదల తరువాత ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లక్ష్మి భాయ్ గ కంగనా నటనకు నూటికి నూరు మార్కులు పడ్డాయి.

క్రిష్ మరియు కంగనా దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల తర్వాత భారీ వసూళ్ళని సాధించింది. దేశవ్యాప్తంగా 3 రోజులలో 46 కోట్లని వసూలు చేసి దాదాపు 50 కోట్లకి చేరువైంది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో వొక మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుందని సినిమా వర్గాల సమాచారం.