నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న యంగ్ హీరో

SMTV Desk 2019-01-28 12:41:58  Vijay Devarakonda, Dill Raju, Dear Comrade, Vijay Remunaration hike

హైదరాబాద్, జనవరి 28: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస విజయాలతో టాప్ హీరో ల జాబితాలో చేరిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా తో అయన తిరుగు లేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. విజయ్ తర్వాత సినిమా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో చేయబోతున్నాడు.చాలా మంది దర్శకులు, నిర్మాతలు విజయ్ కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యం లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విజయ్ తో సినిమా చేయడానికి ఆయనను సంప్రదించాడు. అయితే విజయ్ తన పారితోషకం 10 కోట్లు అని చెప్పగా దిల్ రాజు షాక్ తిన్నాడని సమాచారం. దాంతో దిల్ రాజు ఇప్పుడు విజయ్ పారితోషకం విషయం లో ఆలోచనలో పడ్డాడు. అయినా విజయ్ స్థాయికి ఆ మాత్రం డిమాండ్ చేయడం మాములే అని కొందరు సమర్థిస్తున్నారు.