వెంకీ అట్లూరి కోసం పోటీ..

SMTV Desk 2019-01-28 11:09:57  Akhil, Mr.Majnu, venky atluri, naga chaithanya, vijay devarakonda, nitin, naga sowrya, mytri movie makers

హైదరాబాద్, జనవరి 28: దర్శకుడు వెంకీ అట్లూరి మొదటి చిత్రం తొలి ప్రేమ తోనే మంచి వియజం సొంతం చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను ప్రస్తుతం థియేటర్స్ లో వుంది. ఈ చిత్ర టేకింగ్ విషయంలో వెంకీ అట్లూరి మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ చేయనున్నాడని సమాచారం.

ఇప్పటికే విజయ్ తో వెంకీ అట్లూరి కథా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తరువాత వెంకీ .. నాగ చైతన్యతో వొక సినిమా చేయనున్నట్టు సమాచారం. కాగా యువ హీరోలు నితిన్ .. నాగశౌర్య కూడా ఆయనతో సినిమా చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇలా యంగ్ హీరోలు పోటీ పడుతుండటంతో, వెంకీ అట్లూరికి డిమాండ్ పెరిగిపోయింది.