పాక్ కెప్టెన్ పై వేటు వేసిన ఐసీసీ

SMTV Desk 2019-01-27 16:11:01  Sarfaraz khan, Pakistan captain, South africa, Sports, Cricket

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఐసీసీ వేటు వేసింది. దక్షిణాఫ్రికా క్రికెటర్ అండిలె ఫెలుక్వాయోపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సర్ఫరాజ్ పై నాలుగు మ్యాచ్ ల నిషేధం విధిస్తున్నామని ఐసీసీ ప్రకటించింది. సర్ఫరాజ్ ఉద్దేశపూర్వకంగానే జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఐసీసీ తెలిపింది. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిన అతనిపై వేటు వేస్తున్నామని ప్రకటించింది. జాతి, మతం, రంగు, భాష, సంస్కృతిని కించపరిచేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించింది. దీనిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ స్పందిస్తూ సర్ఫరాజ్ ని క్షమించాము కానీ ఐసీసీ ఏమి చేసిన మాకు సమ్మతం అనేలా మాట్లాడారు. కాగా మరోవైపు సర్ఫరాజ్ పై వేటు పడటంతో... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మరో రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లకు అతను దూరం కానున్నాడు. అతని స్థానంలో షోయబ్ మాలిక్ కెప్టెన్టీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ సందర్భంగా షోయబ్ మాట్లాడుతూ, ఏం జరిగిందో మనందరికీ తెలుసని... దానిపై తాను స్పందించబోనని చెప్పాడు. తనకు కెప్టెన్ గా అవకాశం ఇచ్చారని... తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతానని తెలిపాడు.