ఫిబ్రవరి 4 న ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశం ..!!

SMTV Desk 2019-01-27 11:42:55  Priyanka vadra, Rahul gandhi, Aicc general secretary, Congress party, Kumbhmela

నెహ్రూ - గాంధీ కుటుంబ వారసురాలు, సోనియా గాంధీ ముద్దుల కూతురు, రాహుల్ గాంధీ సోదరిప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతన్న కుంభమేళా కి ఫిబ్రవరి లో వెళ్లనున్నారు. కుంభమేళా లో పవిత్రస్నానం ఆచరించిన తర్వాత ఆ రోజే అనగా ఫిబ్రవరి 4 వ తేదీన క్రియశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. ఇటీవలే ఏఐసీసీ చీఫ్ రాహుల్ ఆమెను ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 4వ తేదీన కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానం ఆచరించి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాల సమాచారం. అనివార్య కారణాల వల్ల ఆ రోజు వీలుకాకుంటే 10వ తేదీన వసంత పంచమి సందర్భంగా కుంభమేళాకు వెళ్లి స్నానమాచరిస్తారని సమాచారం. దేశంలో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పట్టుసాధించేందుకు ప్రియాంక అస్త్రంలా పనిచేస్తుందని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తోంది.
హిందూ కార్డుతో ఓవైపు బీజేపీ దూసుకుపోతుంటే, హిందుత్వ భావనపై కాంగ్రెస్‌ మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శల నేపథ్యంలో కుంభమేళా సందర్భంగా ఈ భావనను చెరిపేసి హిందుత్వ ఎజెండా ఆవిష్కరించాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.