ట్రేండింగ్ లో సూర్యకాంతం టీజర్

SMTV Desk 2019-01-27 10:51:51  Niharika, Suryakantham, Rahul Vijay

హైదరాబాద్, జనవరి 27: మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా రాహుల్ విజయ్ లీడ్ రోల్ గా వస్తున్న సినిమా సూర్యకాంతం. ప్రణీత్ బ్రమాండపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజైంది. సూర్యకాంతం టైటిల్ కు తగినట్టుగానే నిహారిక హీరో రాహుల్ విజయ్ మీద ఫుల్ డామినేషన్ చూపిస్తూ వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇన్నోసెంట్ గాయ్ గా రాహుల్ విజయ్ ఇంప్రెస్ చేయగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ క్యారక్టర్ లో నిహారిక కనిపిస్తుంది.

వొక మనసు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయేసరికి కొద్దిపాటి టైం తీసుకుంది. రెండో ప్రయత్నంగా చేసిన హ్యాపీ వెడ్డింగ్ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక మూడవ ప్రయత్నంగా నిహారిక సూర్యకాంతం సినిమాతో వస్తుంది. ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తో హిట్ కొట్టిన ప్రణీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం గమర్హణం . నిహారికకు ఆ వెబ్ సీరీస్ పేరు తెచ్చిపెట్టినట్టుగా ఈ సినిమా కూడా హిట్ కొడుతుందేమో చూడాలి. ఇప్పటికి ఈ టీజర్ యు ట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తుంది .. ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం ..