ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు

SMTV Desk 2019-01-26 16:35:01  Pranab Mukerjee, Bharata Ratna

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, జనసంఘ్‌ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్‌ హజారికాలకు శుక్రవారం కేంద్రప్రభుత్వం భారతరత్న అవార్డులు ప్రకటించింది.

ప్రణబ్‌ ముఖర్జీ 2012-17 మద్యకాలంలో భారత 13వ రాష్ట్రపతిగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ, “నాకు లభించిన ఈ గొప్ప గౌరవాన్ని దేశప్రజల పట్ల పూర్తి కృతజ్ఞతాభావంతో, విధేయతతో స్వీకరిస్తున్నాను. గతంలో నేను చెప్పినదే మళ్ళీ ఇప్పుడు చెపుతున్నాను. దేశప్రజలకు నేను చేసినదానికంటే వారే నాకు చాలా ఎక్కువ తిరిగి ఇచ్చారు. అందుకు సర్వదావారికి కృతజ్ఞతలు తెలుపుకొంటాను,”అని ట్వీట్ చేశారు.

అస్సాంకు చెందిన వాగ్గేయకారుడు స్వర్గీయ భూపేన్‌ హజారికా పరిచయం అక్కరలేని గొప్ప వ్యక్తి. ఆయన వ్రాసిన, పాడిన పాటలు, దేశభక్తిగీతాలకు అత్యంత ప్రజాధారణ లభించడంతో అవి హిందీ, బెంగాలీ తదితర బాషలలోకి తర్జూమా చేయబడ్డాయి. ఆయన పాటలలో దేశభక్తి, ఎల్లలు లేని మానవత్వం, సోదరభావం, సమన్యాయం వంటివి అంతర్లీనంగా ఉండటంతో పొరుగునే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలు కూడా వాటిని పాడుకునేవారు. ఆయన సాహిత్యాన్ని తమ బాషలోకి అనువదించుకునేవారు. భూపేన్ హజారికా హిందీ సినీ పరిశ్రమలో ప్రవేశించిన తరువాత ఆయన నేపద్యగాయకుడిగా, సినీ కధా రచయితగా, సినీ దర్శకుడిగా గొప్ప పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయనకు అనేక సినీ, జాతీయ అవార్డులు లభించాయి. మరణాంతం ఈ అత్యున్నత పురస్కారం లభించింది.