కాజల్ కొత్త మూవీ టైటిల్ ఇదే..

SMTV Desk 2019-01-26 15:14:45  kajal agarwal, bellamkonda srinivas, teja, sitha movie, title logo

హైదరాబాద్, జనవరి 26: దర్శకుడు తేజ... బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా వొక సినిమా రూపొందిస్తున్నాడు. మొదటి నుంచి ఇది నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా సీత అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకుంది. ఇక ఆ టైటిల్ నే దర్శకుడు తేజ ఖరారు చేసి .. ఈరోజు టైటిల్ లోగోను రిలీజ్ చేసారు.

ఈ చిత్ర టైటిల్ లోగోను చాలా అందంగా తేజ డిజైన్ చేయించాడు. ఈ టైటిల్ ను బట్టి .. ముందుగా అనుకున్నట్టుగానే ఇది నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఈ చిత్రం నుంచి ఫస్టులుక్ రానుంది. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తోన్న ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు.