హైకోర్టు నుంచి నితీష్ కు ఉపశమనం

SMTV Desk 2017-07-31 15:41:07  patna, cm nithish kumar, sarkar, rjd, highcourt, jdu mla sarojyadav, chandanvarma, jithendhar kumar

పాట్నా, జూలై 31 : బీహార్ సీఎం నితీష్ కుమార్ నూతన సర్కార్ కు ఉపశమనం కలిగింది. బీహార్ లో జేడీయూ, భాజపా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ పాట్నా హైకోర్టును ఆశ్రయించిన ఆర్జేడీ ఎస్సీ నేతలకు నిరాశే మిగిలింది. ఆర్జేడీ ఎమ్మెల్యేలు సరోజ్ యాదవ్, చందన్ వర్మ, సమాజ్ వాది పార్టీ సభ్యుడు జితేందర్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్జేడీ కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకొని భాజపాతో కలిసి జేడీయూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీరు పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకుగా ఆహ్వానించేలా ఆదేశాలివ్వలంటూ శుక్రవారం నితీష్ సర్కారు బల పరీక్ష ఎదుర్కోవడానికి ముందు న్యాయస్థానంలో రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణను నేటికి వాయిదా వేసిన పాట్నా హైకోర్టు ఆ వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.