టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన సూర్య..

SMTV Desk 2019-01-26 13:34:59  surya, rakul preeti singh, sai pallavi, selva ragavan, ngk, kappan, teaser

హైదరాబాద్, జనవరి 26: తమిళ హీరో సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మొదట ఎన్జీకే అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టారు. ఇక ఈమద్యే కాప్పాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇప్పటికే షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలో సూర్య ఇంతవరకూ చేయని వొక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో చిత్ర తమిళ టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

కాగా, ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు సెల్వ రాఘవన్ టీజర్ తోనే అంచనాలు పెంచేలా ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నాడు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. రకుల్ ప్రీతి సింగ్ .. సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.