'అసురన్' ఫస్టులుక్ ..

SMTV Desk 2019-01-26 11:33:58  danush, manju varrier, asuran, vetri maran

హైదరాబాద్, జనవరి 26 : తమిళ హీరో ధనుశ్ నటిస్తున్న కొత్త చిత్రం అసురన్ . ఈ సినిమాకి వెట్రి మారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. భిన్నమైన కధాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి, తాజాగా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ ఫస్టులుక్ పోస్టర్ లో ధనుశ్ ఇంతక ముందు ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్ లో ధనుష్ బ్లాక్ కలర్ బనీను .. గళ్ల లుంగీ పైకి కట్టి .. బల్లెం చేత పట్టుకొని దాడికి దిగుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఈ రోజునే మొదలవుతోంది. ఈ సినిమాలో మంజు వారియర్ వొక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.