రవితేజ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్..

SMTV Desk 2019-01-26 11:09:41  raviteja, birthday, VI anand, santosh srinivas, payal rajput, new movie title, disco raja

హైదరాబాద్, జనవరి 26: మాస్ మహారాజ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వొక సినిమా నిర్మితమవుతుంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కథానాయికలుగా నాభా నటేష్ .. పాయల్ రాజ్ పుత్ కనిపించనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమాకి డిస్కో రాజా అనే టైటిల్ ను ఖరారు చేశారు. రవితేజ పుట్టినరోజును పురస్కరించుకొని టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తామన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజున రవితేజ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ చిత్ర టైటిల్ ను బటర్ ఫ్లై రూపంలో తెలుగు .. ఇంగ్లిష్ కలిసిన అక్షరాలతో ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. టైటిల్ క్రింద రివైండ్ .. ఫార్వార్డ్ .. కిల్ అంటూ కొన్ని సంకేతాలు జోడించి చిత్రంపై ఆసక్తి కలిగేలా చేసారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో రవితేజ వున్నాడు.