భారీ స్కోర్ పై కన్నేసిన భారత్ ...

SMTV Desk 2019-01-26 10:36:56  INDvsNZ, Virat kohli, Rohit sharma, Shikar dhwan, Trent boult,Newzeland, second ODI

న్యూజిలాండ్‌, జనవరి 26: ​న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియా దూకుడుగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు తొలి బంతి నుంచే బ్యాట్‌కు పనిచెప్పారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వన్డేల్లో 27వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్ .. బౌల్ట్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. భారత ఇన్నింగ్స్లో ధావన్ మొత్తంగా 67 బంతులు ఎదుర్కొని 9 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ అవుటైనా జోరు తగ్గించని రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో లాకీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 96 బంతులు ఆడిన రోహిత్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 38వ అర్ధ సెంచరీ. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడాడు, అర్ధ సెంచరీ కి చేరువవుతున్న దశలో బౌల్ట్ బౌలింగ్ లో 39.1 ఓవర్ లో సోది చేతిలో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు, కోహ్లీ 45 బంతుల్లో 5 ఫోర్లతో 43 పరుగులు చేసాడు. తర్వాత వచ్చిన అంబటి రాయుడు 42 పరుగులతో, ధోని 9 పరుగులతో క్రీజులో ఉన్నారు​. ఇప్పటికి భారత్ స్కోర్ 43.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 256 పరుగులు సాధించింది. ఇంకో 6 ఓవర్లు , 7 వికెట్లు చేతిలో వున్నాయి కనుక భారత్ భారీ స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.