‘భారత్’ టీజర్ రిలీజ్..

SMTV Desk 2019-01-25 19:40:19  salman khan, katrina kaif, bharat teaser

హైదరాబాద్, జనవరి 25: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్, కత్రికా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘భారత్ . టీ సిరీస్ సమర్పణలో సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ అండ్‌ రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్‌ను గణతంత్ర దినోత్సవ కానుకగా ఈరోజు రిలీజ్ చేసారు.

ఈ టీజ లో ‘అంతా నన్ను నీ ఇంటిపేరు ఏంటి?, జాతి పేరేంటి? మతం పేరేంటి? అని అడుగుతుంటారు. వారందరికీ నేను చిరునవ్వుతో చెప్పే సమాధానం వొక్కటే. మా నాన్న గారు దేశాన్ని మనసులో పెట్టుకుని నాకు ‘భారత్‌ అని పేరు పెట్టారు. దానికి ముందు ఇంటి పేరు, జాతిని చేర్చి నన్ను, నా దేశాన్ని తక్కువ చేయలేను అంటూ సల్మాన్‌ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. టబు, సోనాలి కులకర్ణి, జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.