బాలీవుడ్ బాట పట్టిన '7 /జి బృందావన కాలని'..

SMTV Desk 2019-01-25 18:41:30  7g brundhana colony, T-series, sanjay leela bansali, mijan jafri

హైదరాబాద్, జనవారై 25: వొక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో రీమేక్ అవుతుండటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అయితే 14 సంవత్సరాల క్రితం తెలుగు.. తమిళ భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న ప్రేమకధా చిత్రం 7/జి బృందావన కాలని ని ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. .

తమిళంలో 7/జి రెయిన్బో కాలని పేరుతో 2004 అక్టోబర్లో విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 7/జి బృందావన కాలని పేరుతో తెలుగులో కూడా విడుదలై మంచి హిట్ సాధించింది. అటువంటి ఈ చిత్రాన్ని టి సిరీస్ తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ హిందీలో నిర్మిస్తున్నారు. మంగేశ్ హద్వాలే ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. జావెద్ జెఫ్రీ తనయుడు మిజాన్ జఫ్రీ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.