బీజేపీ పై మమతా ఫైర్ ...

SMTV Desk 2019-01-25 15:43:56  Mamatha banerjee, West bengal CM, Bjp, Akhilesh yadav, Mayawati, Sp, BSp, Twitter

పశ్చిమబెంగాల్, జనవరి 25: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి వరకూ.. ఎవ్వరినీ బీజేపీ విడిచిపెట్టలేదని విమర్శించారు. దేశంలో తూర్పు నుంచి పడమర వరకూ, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ తమ రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. వివరాల్లోకి వెళ్తే ఈరోజు ట్విట్టర్ లో మమతా బెనర్జీ స్పందిస్తూ..‘అఖిలేశ్ నుంచి మాయావతి వరకూ, తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ బీజేపీ ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారు. బీజేపీ నేతలు భయపడ్డారా? ఆశలు సన్నగిల్లాయా? అని ట్వీట్ చేశారు.