ఆహ! ఏమి ఆ అందం ?

SMTV Desk 2019-01-25 13:25:24  tabu, greeku veerudu

గ్రీకు వీరుడు సినిమాలో తన అందంతో అలరించిన టబు ,47 సంవత్సరాల వయసులోనూ చాలా అందంగా కనిపిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మధ్య రిలీజ్ ఐన వొక ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ ఐతుంది. బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఈ పిక్ కుర్రకారు ఫాన్స్ లో అలజడి రేపుతోంది . లేట్ వయసులో ఇంత అందమా అని తెగ కామెంట్స్ చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ వంటి అనేక భాషా చిత్రాల్లో నటించిన టబు వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు. స్టయిల్ బ్యాచిలర్ గా ఉంటూ.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. టాలీవుడ్ లో కింగ్ నాగార్జున, బాలీవుడ్ లో టబులకు వయసు పెరిగే కొలది అందం కూడా పెరుగుతుండటం విశేషం.

1971 లో పుట్టిన టబు, 1980లో వచ్చిన బజార్ సినిమాలో చిన్న రోల్ చేసింది. ఆ తరువాత 1985 లో హమ్ నౌజవాన్ లో దేవ్ ఆనంద్ కూతురిగా యాక్ట్ చేసింది టబు. తెలుగులో వెంకటేష్ తో కూలి నెంబర్ 1 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే .