మన ఓటు మన హక్కు ..!!..

SMTV Desk 2019-01-25 13:19:07  National voters day, Narasimhan, Governor, Telangana state, Rajath kumar,Ravindra bharathi

హైదరాబాద్‌, జనవరి 25: ఈరోజు రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర నరసింహన్‌ మాట్లాడుతు ప్రతి భారతీయ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ నరసింహన్ విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి వొక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా హెల్ప్‌లైన్ నెంబర్ 1950ను . నా ఓటు వాల్‌పోస్టర్, బ్రోచర్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, ఎన్నికల సంఘం అధికారి నాగిరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.