అగ్రవర్ణాల 10% రిజర్వేషన్ల స్టేకు సుప్రీం నిరాకరణ !!

SMTV Desk 2019-01-25 12:49:45  Ebc bill stay, supreme court, central government, ranjan gogoi, Ebc reservations, youth for equality

న్యూ డిల్లీ, జనవరి 25: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ అనే సంస్థతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు సుప్రీంను ఆశ్రయించారు.
దీంతో ఈబీసీ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంపై దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై స్టే విధించడానికి నిరాకరించింది.