సీఎంపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేత..

SMTV Desk 2019-01-24 15:39:46  Pinarayi Vijayan, Congress party, kerala, Controversial comments, Sudhakaran

తిరువనంతపురం, జనవరి 24: కేరళ సీఎం పినరయి విజయన్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.సుధాకరన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారీ వరదలు సంభవించి తీవ్రంగా నష్టపోయిన కేరళను సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ చేపట్టిన ఓ ధర్నా కార్యక్రమంలో సుధాకరన్‌ మాట్లాడుతూ.. కేరళ పునర్నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు.

‘సీఎంగా విజయన్‌ సమర్థవంతంగా పనిచేస్తారని భావించాం. కానీ ఆ అంచనాల్ని తలక్రిందులు చేస్తూ ఆయన అత్యంత చెత్త పాలన సాగిస్తున్నారు. సీఎం రాష్ట్రం పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. విజయన్‌ ఏ పనిని సరిగా నిర్వర్తించలేకపోయారు . కమ్యునిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విజయన్‌ మగాడిలా రంగంలోకి దూసుకొచ్చారు. కానీ, నేడు అసమర్థ సీఎంగా మిగిలిపోయారు. ఆయన కంటే మహిళలే నయం అని సుధాకరన్‌ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుధాకరన్‌ ముఖ్యమంత్రి స్థాయిని దెబ్బతీసేలా మట్లాడడం పట్ల కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది.